|
ధృతరాష్ట్ర
ఉవాచ
|
|
1
|
ధర్మ-క్షేత్రే కురు-క్షేత్రే సమవేతా యుయుత్సవః ।
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ॥ |
|
ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతాడు. పుణ్యభూమి కురుక్షేత్రం యుద్దం చేయాలనుకున్న ఇక్కడ చేరిన నా కొడుకులు మరియు నా తమ్ముడైన పాండు కుమారులు ఏం చేశారు. |
|
సంజయ
ఉవాచ
|
|
2
|
దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ।
ఆచార్యముప సంగమ్య రాజా వచనమబ్రవీత్ ॥ |
|
సంజయుడు సమాధానం ఇచ్చినాడు. దొర, యుద్ధానికి సిద్ధంగా ఉన్న పాండవ సైన్యాన్ని చూసిన దుర్యోధన రాజు,ద్రోణాచార్యులు వద్దకు వెళ్లి ఇలా అన్నాడు. |
|
3
|
పశ్శైతాం పాండు-పుత్రాణాం ఆచార్య మహతీం చమూం ।
వ్యూఢాం ద్రుపద-పుత్రేణ తవ శిష్యేణ ధీమతా ॥ |
|
ఓ ఆచార్య ఈ గొప్ప పాండవుల సైన్యాన్ని చూడు ద్రుపద రాజు కుమారుడైన మీ శిష్యుడు ఈ సైన్యానికి తెలివితేటలుతో సమకూర్చాడు చూడండి. |
|
4
|
అత్ర శూరా మహేష్వాసాః భీమార్జున-సమా యుధి ।
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ॥ |
|
5
|
ధృష్టకేతుశ్చేకితానః కాశి-రాజశ్చ వీర్య-వాన్ ।
పురు-జిత్ కుంతి-భోజశ్చ శైబ్యశ్చ నర-పుంగవః ॥ |
|
6
|
యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్య-వాన్ ।
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ॥ |
|
ఈ సైన్యంలో అందరూ మహారథలు, శూరులు, వీరులు గొప్ప విలుకాండ్రు, భీముడు మరియు అర్జునులతో సమానమైన యోధులు. యుయుదన .(సాత్యాకి) విరాటుడు,దృపదుడు, శిశుపాల కుమారుడు ద్రుష్ట కేతువు, యదువంశానికి చెందిన చేకితాన, భీముని మామ కాశిరాజు, కుంతీ భోజుని కుమారుడు పురుజిత, కుంతి భోజుడు, కేకేయి తండ్రి శైబ్యుడు, సుభద్రేయ కుమారుడు అభిమన్యుడు,మరియు ద్రౌపతియ ఐదుగురు కుమారులు ప్రతి వింధ్య,సుత సోమ, శ్రుత కీర్తి, శతానిక, శృతక్రియ. |
|
7
|
అస్మాకం తు విశిష్టా యే తాన్ నిబోధ ద్విజోత్తమ ।
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ॥ |
|
ఓ ఆచార్య మనలో గొప్పవారలను కూడా చెబుతాను వినండి. సైన్యానికి నాయకులు వీరు నీవు గుర్తించుకోవడానికి చెబుతున్నాను. |
|
8
|
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం-జయః ।
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ॥ |
|
వారు భీష్ముడు, కర్ణుడు, యుద్ధ ప్రణాంగాల్లో కృప, అశ్వత్థామ, వికర్ణ దుర్యోధనని తమ్ముడు, సోమ దత్తుని కుమారుడు భూరీ శ్రవస్. |
|
9
|
అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్త-జీవితాః ।
నానా-శస్త్ర-ప్రహరణాః సర్వే యుద్ధ-విశారదాః ॥ |
|
నాకోసం ప్రాణాలర్పించేందుకు ఇంకా ఎంతోమంది శూరులు సిద్ధంగా ఉన్నారు. వీరంతా రకరకాల ఆయుధములతో యుద్ధం చేయగలరు, యుద్ధంలో నైపుణ్యం కలవారు. |
|
10
|
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభి-రక్షితం ।
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభి-రక్షితం ॥ |
|
భీష్ముని రక్షణలో ఉన్న మన సైన్యం సరిపోదు. భీముని రక్షణలో ఉన్న అతని సైన్యం కావలసినంత ఉన్నది. |
|
11
|
అయనేషు చ సర్వేషు యథా-భాగమవ-స్థితాః ।
భీష్మమేవాభి రక్షంతు భవంతః సర్వ ఏవ హి ॥ |
|
పోరాటంలో అన్ని వైపులా మీకు ఇచ్చిన స్థానంలో మీరందరూ తప్పకుండా భీష్ముని కాపాడాలి. |
|
12
|
తస్య సం-జనయన్ హర్షం కురు-వృద్ధః పితామహః ।
సింహ-నాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాప-వాన్ ॥ |
|
కురువంశంలో జేష్ఠుడైన భీష్ముడు తన తాత దుర్యోధనుడిని ప్రసన్నం చేసుకోవడానికి సింహంలా గర్జించి శత్రువుల కష్టాలకు శంఖం ఊదాడు. |
|
13
|
తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక-గోముఖాః ।
సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములోఽభవత్ ॥ |
|
ఆ వెంటనే శంఖాలు , నగారిలు తప్పటలు, డోలు, కహలే అన్ని ఒకేసారిగా మ్రోగించిరి. ఆ శబ్దమే దద్దరిల్లిoది. |
|
14
|
తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ ।
మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః ॥ |
|
ఆ తర్వాత నాలుగు తెల్లని గుర్రాలు చే లాగిన పెద్ద రథంలో కృష్ణుడు మరియు అర్జునుడు ఉత్తమ శంఖాన్ని పూరించిరి. |
|
15
|
పాంచజన్యం హృషీకేశో దేవ-దత్తం ధనం-జయః ।
పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమ-కర్మా వృకోదరః ॥ |
|
కృష్ణుడు సముద్రంలో పంచజన అని దైత్యున్ని సంహరించి లభించిన పాంచ జన్య శంఖమును పూరించెను. అర్జునుడు స్వర్గంలో ఇంద్రుడు ఇచ్చిన దేవదత్త అను శంఖాన్ని పూరించెను. దుష్టులకు భయం కలిగించే సజ్జనులకు శాస్త్రోపదేశం చేయు భీమసేనుడు పౌన్డ్రా అనే పెద్ద శంఖాన్ని పూరించెను. |
|
16
|
అనంత-విజయం రాజా కుంతీ-పుత్రో యుధిష్ఠిరః ।
నకులః సహ-దేవశ్చ సుఘోష-మణి-పుష్పకౌ ॥ |
|
కుంతీపుత్రుడు యుధిష్టరా రాజు అనంత విజయ అనే శంఖాన్ని పూరించెను. నకులుడు సుఘోష అనే శంఖాన్ని సహదేవుడు మణి పుష్ప అనే శంఖాన్ని పూరించెను. |
|
17
|
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః ।
ధృష్ట-ద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ॥ |
|
18
|
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీ-పతే ।
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్-పృథక్ ॥ |
|
ఓ రాజా ధృతరాష్ట్ర, గొప్ప విలుకాడు కాశీ రాజు, మహారథి శిఖండి, దృష్టధ్యమునుడు, విరాటుడు, అజేయుడైన సాత్యకి, దృపదుడు, ద్రౌపదీ కుమారులు ఆజానుబాహు కలిగిన అభిమన్యుడు అందరూ తమ శంఖాన్ని ఒక్కొక్కటిగా పూరించారు. |
|
19
|
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ ।
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యను-నాదయన్ ॥ |
|
ఆ కర్కశ శబ్దం ఆకాశాన్ని భూమిని ప్రతిధ్వనులతో నింపి వంద మంది కౌరవుల వక్షస్థలాన్ని చీల్చి చెండాడింది. |
|
20
|
అథ వ్యవస్థితాన్ దృష్ట్వాధార్తరాష్ట్రాన్ కపి-ధ్వజః ।
ప్రవృత్తే శస్త్ర-సంపాతే ధనురుద్యమ్య పాండవః ॥ |
|
21
|
హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీ-పతే ।
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత ॥ |
|
ఓ రాజా అప్పుడు యుద్ధం ప్రారంభించడానికి హనుమద్వజ అర్జునుడు,. కౌరవులు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించి తన విల్లును వంచి బిగించి కృష్ణునితో ఇలా అన్నాడు ఓ అచ్యుత రెండు సైన్యాల మధ్య నారతాన్ని తీసుకెళ్లండి. |
|
22
|
యావదేతాన్ నిరీక్షేఽహం యోద్ధు-కామానవ-స్థితాన్ ।
కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ-సముద్యమే ॥ |
|
పోరాటానికి వచ్చిన వీళ్ళందరిని చూస్తాను ఈ పోరాటంలో నేను ఎవరెవరితో పోరాడాలి. |
|
23
|
యోత్స్యమానానవేక్షేఽహం య ఏతేఽత్ర సమాగతాః ।
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియ-చికీర్షవః ॥ |
|
నేను యుద్ధవాదులను తప్పక చూడాలి. ఇక్కడకు వచ్చి చేరిన వారంతా బుద్ధిహీన దుర్యోధనుడికి విజయం చేకూర్చేందుకు కృషి చేస్తున్నారు. |
|
24
|
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత ।
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం ॥ |
|
25
|
భీష్మ-ద్రోణ-ప్రముఖతః సర్వేషాం చ మహీ-క్షితాం ।
ఉవాచ పార్థ పశ్శైతాన్ సమవేతాన్ కురూనితి ॥ |
|
ఓ దొర ఇట్లు అర్జునుడు కోరగా, ఆ పెద్ద రథమును రెండు సేనెల మధ్య శ్రీకృష్ణుడు నిలిపి అందరి రాజులు మధ్య,భీష్మ ద్రోణుల ఎదుట నిలిపి, ఓ అర్జున ఇక్కడ సమావేశమైన అందరి కౌరవులను చూడము. |
|
26
|
తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితౄనథ పితామహాన్ ।
ఆచార్యాన్ మాతులాన్ భ్రాతౄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా ॥ |
|
27
|
శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి । |
|
అర్జునుడు ఇరుపక్షాల సైన్యంలోని తండ్రులు, తాతలు, గురువులు, మేనమామలు, అన్నదమ్ములు, పిల్లలు, మనుమలు, స్నేహితులు మరియు మామలతో పాటు శ్రేయోభిలాషులను చూశాడు. |
|
|
కృపయా పరయాఽఽవిష్టో విషీదన్నిదమబ్రవీత్ ॥ |
|
28
|
తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవ-స్థితాన్ । |
|
అక్కడ సమీపంలో గుమిగూడిన బంధువులందరినీ దగ్గరలో చూసి అర్జునుడు చాలా జాలిపడి శోక సంతప్తుడై ఇలా అన్నాడు. |
|
|
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముప-స్థితం ॥ |
|
29
|
సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరి-శుష్యతి ।
వేపథుశ్చ శరీరే మే రోమ-హర్షశ్చ జాయతే ॥ |
|
ఓ కృష్ణ , వచ్చి చేరిన నా బంధువుల్లో ప్రతి ఒక్కరిని చూసి నా అవయవాలు రాలిపోతున్నాయి, నోరు ఎండిపోతున్నాయి, శరీరం వణుకుతోంది, రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. |
|
30
|
గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్ చైవ పరి-దహ్యతే ।
నచ శక్నోమ్యవ-స్థాతుం భ్రమతీవ చ మే మనః ॥ |
|
గాండీవ ధనస్సు చేతి నుండి జారిపోతుంది. నా శరీరం వేడెక్కుతుంది . నిటారుగా నిలబడలేక పోతున్నాను. నా మనసు ఎక్కడో తిరుగుతోంది. |
|
31
|
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ ।
నచ శ్రేయోఽను పశ్యామి హత్వా స్వ-జనమాహవే ॥ |
|
ఓ కేశవ నాకు చెడు సూచనలు కనిపిస్తున్నాయి. యుద్ధంలో నా ప్రజలను చంపిన తర్వాత నాకు మంచి ఏమీ కనిపించదు. |
|
32
|
న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ ।
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ॥ |
|
కృష్ణ నాకు విజయం కోరిక లేదు .నాకు రాజ్యంగానీ సుఖాలు గానీ అక్కర్లేదు. ఓ గోవిందా రాజ్యం వల్ల మనకు ఏం లాభం? మనకు ఆనందం మరియు సంతోషకరమైన జీవితం ఎందుకు అవసరం. |
|
33
|
యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ ।
త ఇమేఽవ-స్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ॥ |
|
ఎవరికోసం మనం సకల రాజ్యాలు,భోగాలు , సౌభాగ్యాలు కోరుకుంటున్నాము,వారు సమస్త సంపదలను తమ ప్రాణాలను కూడా యుద్ధంలో వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. |
|
34
|
ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః ।
మాతులాః శ్వశురాః పౌత్రాః స్యాలాః సంబంధినస్తథా ॥ |
|
ఆచార్యులు తండ్రి లాంటివారు, పిల్లలు, అలాగే తాతలు, మేనమామలు, మామలు, బావమరుదులు, మనములు మరియు బంధువులు. |
|
35
|
ఏతాన్ న హంతుమిచ్ఛామి ఘ్నతోఽపి మధు-సూదన ।
అపి త్రైలోక్య-రాజ్యస్య హేతోః కిం ను మహీ-కృతే ॥ |
|
ఓ మధుసూదనా మూడు లోకాలు ఆదిపత్యం దొరికినా, కొట్టేవాడిని చంపడం నాకు ఇష్టం లేదు. ఈ కొద్ది భూమికోసం ఇక్కడ ఎందుకు పోరాడాలి. |
|
36
|
నిహత్య ధార్తరాష్ట్రాన్ నః కా ప్రీతిః స్యాజ్జనార్దన ।
పాపమేవాఽశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః ॥ |
|
జనార్ధన కౌరవులను చంపితే మనకేమి ఆనందం కలుగును? నిప్పంటించి, విషం పెట్టి, ఆస్తులు లాకున్న ఈ శత్రువులను చంపితే పాపం సోకుతుంది. |
|
37
|
తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వ-బాంధవాన్ ।
స్వ-జనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ ॥ |
|
కనుక మన బంధువులైన కౌరవులను చంపడానికి మేము తగము. ఓ మాధవ స్వజనులను చంపి ఎలా సుఖం పొందగలము. |
|
38
|
యద్యప్యేతే న పశ్యంతి లోభోప-హత-చేతసః ।
కుల-క్షయ-కృతం దోషం మిత్ర-ద్రోహే చ పాతకం ॥ |
|
వీరి బుద్ధి దురాశతో చెడిపోయినది.కనుక వంశ నాశనము వలన కలిగే నష్టము గాని మిత్రులను మోసం చేసిన పాపము గాని వారు చూడరు. |
|
39
|
కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం ।
కుల-క్షయ-కృతం దోషం ప్ర-పశ్యద్భిర్జనార్దన ॥ |
|
ఓ జనార్ధన ఈ వంశ వినాశాన్ని బాగా మొదటే ఊహించగల మనకు ఈ దుష్ట పోరాటాన్ని విరమించకూడదని ఎందుకు ఆలోచింపరాదు. |
|
40
|
కుల-క్షయే ప్రణశ్యంతి కుల-ధర్మాః సనాతనాః ।
ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోఽభి-భవత్యుత ॥ |
|
అన్ని వంశాలు నాశనమైతే గతంలో కొనసాగుతున్న వంశ ఆచారములు ధ్వంస మవుతాయి. ధర్మాలు చేయకుంటే అధర్మం పాలిన పడుతుంది. |
|
41
|
అధర్మాభి-భవాత్ కృష్ణ ప్ర-దుష్యంతి కుల-స్త్రియః ।
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ-సంకరః ॥ |
|
ఓ వృష్ణి వంశపు కృష్ణ, ఇంటింటి కుమార్తెలు అధర్మమమునకు లోనై దారి తప్పుతారు. ఆడది చెడిపోతే మిశ్ర సమాజం ఏర్పడుతుంది. |
|
42
|
సంకరో నరకాయైవ కుల-ఘ్నానాం కులస్య చ ।
పతంతి పితరో హ్యేషాం లుప్త-పిండోదక-క్రియాః ॥ |
|
ఈ అశుద్ధత వలన వంశం చెడిపినవారు, వంశవారు నరకానికి కారకులవుతారు. అటువంటి వారి పూర్వీకులు పిండ తర్పణాలు లేకుండా దుర్గతిని పొందుతారు. |
|
43
|
దోషైరేతైః కుల-ఘ్నానాం వర్ణ-సంకర-కారకైః ।
ఉత్సాద్యంతే జాతి-ధర్మాః కుల-ధర్మాశ్చ శాశ్వతాః ॥ |
|
ఈ వంశం చెడగొట్టిన సముదాయము వలన మిశ్రిత సమాజము, తప్పుల వలన నరకానికి కారణమవుతుంది. |
|
44
|
ఉత్సన్న-కుల-ధర్మాణాం మనుష్యాణాం జనార్దన ।
నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమ ॥ |
|
ఓ జనార్ధన వంశపారంపర్య విధివిధానాలు తప్పినందువలన మానవులకు, నరకానికి కచ్చితంగా దారి తీస్తాయని మనం బాగా విన్నాము. |
|
45
|
అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం ।
యద్రాజ్య-సుఖ-లోభేన హంతుం స్వ-జనముద్యతాః ॥ |
|
అయ్యో! రాష్ట్ర సుఖం కోసం మనం వాళ్ళని చంపడానికైనా సిద్ధపడ్డాం ఎంతటి మహా పాపం చేయబోతున్నాం. |
|
46
|
యది మామప్రతీకారం అశస్త్రం శస్త్ర-పాణయః ।
ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమ-తరం భవేత్ ॥ |
|
ఒకవేళ పోరాటంలో నిరాయుధమైన నన్ను ఆయుధపట్టిన కౌరవులు యుద్ధంలో చంపితే అది నాకు చాలా క్షేమమగును. |
|
47
|
ఏవముక్త్వాఽర్జునః సంఖే రథోపస్థ ఉపావిశత్ ।
విసృజ్య స-శరం చాపం శోక-సంవిగ్న-మానసః ॥ |
|
ఇదంతా చెప్పి అర్జునుడు తీవ్ర దుఃఖంతో తన ధనుర్బాణాలను విసిరి రథం మధ్యలో కూర్చున్నాడు. |