ముందుగా చదవడానికి
నారాయణుడు 5823 సంవత్సరాల క్రితం శ్రీ వేద వ్యాస ఋషి రూపంలో ఈ భారత దేశంలో అవతరించాడు. వ్యాస మహర్షి మానవ పఠనానికి వేదాలను ఉద్ధరించాడు. వేదాల కంటే శ్రేష్టమైన మహాభారతాన్ని సృష్టించాడు. పంచ పాండవుల ప్రధాన కథగా సంస్కృత భాషలో రచించిన మహాభారతం నేటికీ అందరికీ అన్ని బోధించే గొప్ప గ్రంథం.
పాండవులు ఒక ద్యుతం లో కౌరవుల చేతిలో ఓడిపోయారు. ఒప్పంద ప్రకారము అజ్ఞాతవాసం మరియు వనవాసం ముగించి తర్వాత తమ రాజ్యాన్ని తిరిగి ఇవ్వమని కోరారు. పాండవుల దూతగా శ్రీకృష్ణుడు కౌరవుల వద్దకు వెళ్లి వారికి రాజ్యంలో ఏంతయో కొంత వాటా ఇవ్వాలని చెప్పాడు. కౌరవులు ఒక్క పాలు ఇవ్వకపోవడంతో పాండవలు కౌరవుల మధ్య యుద్ధం జరిగింది. కురుక్షేత్రంలో 18 రోజుల పోరాటం జరిగింది. రథంలో యుద్ధం చేసే అర్జునుడి రథ సారథిగ శ్రీకృష్ణుడు యుద్ధంలో చేరాడు. ఇంకా చాలా వ్యూహాలలో కృష్ణుడు సలహాలు మరియు సూచనలు ఇచ్చి యుద్ధంలో పాండవులను రక్షించాడు. పాండవులు గెలిచారు. శ్రీకృష్ణుని నాయకత్వం లో 36 సంవత్సరాలు పరిపాలించాడు.
కౌరవుల తండ్రి అయిన దృతరాష్ట్రుడు, పాండవ కౌరవ యుద్ధం గురించి తన సూతుడు సంజయుని చేత విన్నాడు. ఎందుకంటే అతడు అంధుడు. 10 రోజులపాటు కురుక్షేత్రంలో జరిగిన పోరాటాన్ని దగ్గర నుండి చూసిన సంజయుడు ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లి భీష్మ పతనాన్ని ఆందోళనతో చెప్పాడు. ఇది విన్న ధృతరాష్ట్రుడు మొదటి నుండి యుద్ధం యొక్క అన్ని వివరాలు చెప్పమని అడుగుతాడు. వ్యాసుని విశేష అనుగ్రహంతో తుంబూరు గంధర్వుడైన సంజయుడు , అప్పటికి అతను యుద్ధ భూమిలో ప్రతిదీ చూసినట్లుగా, మరియు విన్నట్లుగా యోధులు ఆలోచిస్తున్నదంతా తెలిసినట్లుగా దృతరాష్ట్రుడి ప్రశ్నలకు మరియు సందేహాలకు తగిన సమాధానం ఇచ్చాడు. ఈ విధంగా యుద్ధం యొక్క మొదటి రోజు ప్రారంభంలో అర్జునుడు మరియు కృష్ణుడి మధ్య జరిగిన సంభాషణ సంజయు నుండి భగవద్గీతగా ఉద్భవించింది.
తెలుగు భాషలో కృష్ణుడి సందేశాలు మరియు వాటి సంక్షిప్త సమీక్ష ఈక్కడ ఉన్నాయి. కృష్ణుడి సిద్ధాంతానికి వ్యతిరేకం లేకుండా వ్రాయబడిన వెయ్యి అర్థాలతో కూడిన గీతకు ఇది నా అంకితం. గురు కానుక.
మంగళాచరణము
నారాయణం సుర-గురుం జగదేక-నాథం భక్త-ప్రియం సకల-లోక-నమస్కృతం చ ।
త్రైగుణ్య-వర్జ్జితమజం విభుమాద్యమీశం వందే భవఘ్నం అమరాసుర-సిద్ధ-వంద్యం ॥
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం ।
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే ॥